సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వరుస 6 పరాజయాలు తరువాత 200 కోట్ల వసూళ్లతో ఇరుముడి’తో తన కెరీర్ లోనే నెంబర్ 1 బ్లాక్‌బస్టర్ అందుకున్నారు మాస్ మహారాజా రవితేజ (Ravi teja). ఫుల్ జోష్ లో తదుపరి ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టారు. ‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ వంటి విభిన్న చిత్రాలతో తనదైన మార్క్ కామెడీ, టేకింగ్‌తో ఆకట్టుకున్న దర్శకుడు హసిత్ గోలితో రవితేజ తో పాటు మరో హీరో భీమవరం మేడ్ శ్రీ విష్ణు కూడా జతకడుతున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రేపు సెప్టెంబర్ లో ప్రారంభమయి 2027సంక్రాంతి కానుకగా 4 నెలలలో విడుదల కానుంది. ఇందులో రవితేజకు జోడీగా టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా శ్రీవిష్ణు జోడీగా మాళవికా మోహనన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం,
