సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘ఖేలో ఇండియా సంవాద్ – ఖేల్ కీ బాత్, PM మోదీ కే సాథ్’ కార్యక్రమంలో భాగంగా భీమవరం బీవీ రాజు కళాశాల ప్రాంగణంలో గురువారం ‘వికసిత్ భారత్ యూత్ కనెక్ట్ – స్పోర్ట్స్ ఎడిషన్’ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హాజరయ్యారు. ముందుగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్‌కు ఘనంగా నివాళులర్పించి, వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా యువత నుద్దేశించి చేసిన స్ఫూర్తిదాయక Live ప్రసంగాన్ని భారీ తెరపై ప్రదర్శించాహ్రూ. నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, పాలకోడేరు సహకార సొసైటీ అధ్యక్షులు నాగరాజు, పెద్ద సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు
