సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం హుండీలు నేడు, గురువారం తెరచి లెక్కించారు, దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో జరిగిన లెక్కింపు కార్యక్రమం లో 79 రోజుల కాలానికి హుండీల ద్వారా రూ 73,81,359. డబ్భై మూడు లక్షల ఎనభై ఒక వేయి మూడు వందల యాభై తొమ్మిది లభించగా బంగారం 23 గ్రాములు 150 మిల్లీగ్రాములు, వెండీ 360 గ్రాములు శ్రీ అమ్మవారికి హుండీల ద్వారా భక్తులు సమర్పించారు. కాకినాడ MSN చారిటీస్ అసిస్టెంట్ కమిషనర్ చాగంటి సురేష్ నాయుడు పర్యవేక్షణలో జరిపిన ఈ లెక్కింపులో ఆలయప్రధానార్చకులు , ధర్మకర్తల మండలి సభ్యులు చైర్మన్ పాల్గొన్నారు.
