సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: భీమవరంలో వరద బాధితులకు సహాయార్థం దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే అంజిబాబు రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం బులియన్ మర్చంట్ అసోసియేషన్, భీమవరం పాన్ బొకర్స్ అసోసియేషన్, ధర్మ కాట అసోసియేషన్ సభ్యులు కలిపి రూ 4 లక్షలు వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే అంజిబాబుకు విరాళాన్ని అందించారు. దాతలను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. కార్యక్రమంలో కారుమూరి సత్యనారయణ మూర్తి,కోట్ల నాని, , విజ్జురోతి రమణ, బోండాడ నాగ భూషణం, వబిలిశెట్టి రామకృష్ణ, వబిలిశెట్టి వెంకటేశ్వరావు, బోండా రామకృష్ణ, వబిలిశెట్టి పార్ధసారధి, ఎక్కల శ్రీను, బోండా రాంబాబు, టీడీపి రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వర్రావు, పొత్తూరి బాపిరాజు తదితర సభ్యులు పాల్గొన్నారు.
