సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ నెల 26న జరగనున్న మలి విడత మున్సిపల్ ఎన్నికల కోసం భీమవరంలో వైసీపీ వార్డు కౌన్సిలర్లు మరియు చైర్‌పర్సన్ అభ్యర్థులను సిద్ధం చేసింది.. భీమవరం లో ప్రస్తుతానికి ఇద్దరు ఎమ్మెల్సీ లు వైసీపీ కి ఉన్నారు.వారిలో ఒకరు ఏకంగా ..రాష్ట్ర శాసన మండలి చైర్మెన్ మోషేను రాజు కాగా మరొకరు కవురు శ్రీనివాస్.. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించామనే ఉత్సాహంతో అధినేత జగన్ ఆదేశాలతో భీమవరం క్యాడర్ కూడా మున్సిపల్ పోరులో మరింత దూకుడు గా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకొంది కూటమి లో కేంద్ర మంత్రి ,ఎమ్మెల్యే , రాజ్యసభ సభ్యుడు, మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ మునిసిపల్ చైర్మెన్ వంటి హేమాహేమలు నేతలు అంగబలం అర్ధ బలం ఉన్న నేతలు ఉన్నప్పటికీ వైసీపీ సత్తా చాటేవిధంగా 52 వార్డులలో మంచి కెపాసిటీ ఉన్న అభ్యర్థులను బరిలోకి దించే ప్రయత్నంలో భాగంగా కొయ్య మోషేనురాజు నివాసం వద్ద నియోజకవర్గ ఇంచార్జి చినమిల్లి వెంకటరాయుడు ,ఎస్ఈసీ సభ్యుడు మేడిది జాన్సన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఏఎస్ రాజు, వేండ్ర వెంకటస్వామి,, కామన నాగేశ్వ రరావు, జిల్లా బిసి నేత కోడె యుగంధర్, గాదిరాజు రామరాజు,జిల్లా మహిళా అధ్య క్షురాలు కోడే విజయలక్ష్మి తదితరులు ఈనెల 26 జరిగే భీమవరం మున్సిపల్ ఎన్ని కలకు చైర్ పర్సన్ అభ్యర్థి గా ‘యదాల మాధవిలత‘ ను జిల్లా వైసీపీ ప్రసిడెంట్ ముదునూరి ప్రసాదరాజు ప్రకటించారు. ఇతర వార్డు కౌన్సిలర్ అభ్యర్థులను ఇప్పటికే 90 శాతం మందిని ఎంపిక పూర్తీ చేసారు. కొందరు సీనియర్ కౌన్సిలర్స్ మరల వైసీపీ తరపున బరిలో నిలబడుతున్నారు. వెంకటరాయుడు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నందున మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ క్యాడర్ పనిచేస్తుందని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *