సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీ గణనాథుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందని, భక్తిశ్రద్ధలతో భీమవరంలో వాడవాడలా వినాయక చవితి వేడుకలను నిర్వహించడం ఇప్పుడు అన్నసమారాధన లు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. నేడు, బుధవారం భీమవరం స్థానిక మెంటేవారి తోటలోని వండర్ కిడ్స్ స్కూల్ దగ్గర వరసిద్ధి వినాయక చవితి 24వ వార్షిక మహోత్సవంలో భాగంగా మెంటేవారి యూత్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు, టిడిపి రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్ధసారధి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు,ప్రారంభించారు. ముందుగా మహా నివేదనకు ముందు గణేశునకు హారతులు ఇచ్చి భక్తులకు అన్న సమారాధన ప్రారంభించారు. విఘ్నాలను తొలగించి, సన్మార్గాన్ని చూపే గణనాథుడి అనుగ్రహం ప్రతిఒక్కరిపై ఉండాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *