సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సఫాయి మిత్ర సురక్షా ఇవం సమ్మాన్ కార్యక్రమంలో భాగంగానేడు, బుధవారం భీమవరం మునిసిపల్ కార్యాలయం ఆవరణలో స్థానిక మున్సిపల్ కార్మికులు, కుటుంబ సభ్యులకు భీమవరం మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్రారెడ్డి ఆదేశాలు మరియు వారి పర్యవేక్షణలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసారు. సఫాయి మిత్రలు, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలించి, అవసరమైన వైద్య సలహాలు మరియు ఆరోగ్య పరిరక్షణ సూచనలు అందించారు. ప్రతిరోజూ ప్రజల ఆరోగ్యాన్ని, నగర పరిశుభ్రతను కాపాడేందుకు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం, భద్రత మరియు సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *