సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అన్ని దానాల కెల్లా అన్నదానం గొప్పదని, 58 ఏళ్లుగా వినాయక చవితి వేడుకలను నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం బుధవారం మార్కెట్ లోని 7 దశాబ్దాలుగా ప్రఖ్యాతి గాంచిన శ్రీవరసిద్ధి వినాయక శ్రీభవాని దుర్గ మల్లేశ్వరి స్వామివార్ల దేవస్థానంలో 58వ వార్షికోత్సవంలో భాగంగా సోమవారం నిర్వహించిన అన్న సమారాధనను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ముందుగా స్వామివారికి మహానివేదన చేసి హారతులు ఇచ్చారు. వేలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ సభ్యులు, కూటమి నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *