సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: స్థానిక డి.ఎన్.ఆర్ కళాశాలలో ‘తెలుగు భాషా దినోత్సవ’ వేడుకలు కళాశాల నేడు, శనివారం తెలుగు శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి. మోజెస్ తెలిపారు. విద్యార్థులు తెలుగు కవులు ప్రముఖుల వేషధారణలో అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల యాజమాన్య వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగా రాజు మాట్లాడుతూ, మాతృభాష అయిన తెలుగు అత్యంత ప్రాచీనమైనదని, దాని సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందన్నారు. తెలుగు భాషలోని తియ్యదనాన్ని, గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని పిలుపునిచ్చారు.తెలుగు శాఖాధిపతి టి. చిట్టిబాబు మాట్లాడుతూ, ఆధునిక కాలంలో పరభాషా మోజులో పడకుండా మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. దైనందిన జీవితంలోనూ, విద్యా విధానంలోనూ తెలుగు వినియోగాన్ని పెంచాలని సూచించారు.పలువురు తెలుగు అధ్యాపకులు, సిబ్బంది పాలకవర్గ సభ్యులుఈ కార్యక్రమంలో విద్యార్దినీ విద్యార్దులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
