సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు, సోమవారం మీడియాతో మాట్లాడుతూ… స్థానిక ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం వరించిందని, రాష్ట్రంలో ‘ప్రజలు మంచి పాలన.. మంచి పాలిటిక్స్‌‘ను నమ్ముతానని.. తన నమ్మకాన్ని ప్రజలు ఈసారి నిజం చేశారని తెలిపారు. 2024 కంటే మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు. ‘2024లో మాకు 55.3 శాతం ఓట్లు వస్తే.. వైసీపీకి 39 శాతం ఓట్లు వచ్చాయి’ అని అన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమికి 58.9 శాతం ఓట్లు వస్తే.. వైసీపీకి 33.56 శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు. .ఎంపీటీసీ స్థానాల్లో 90 శాతంపైనే కూటమి కైవసం చేసుకుందని.. 659 జడ్పీటీసీ స్థానాల్లో కూటమి 575 స్థానాల్లో విజయం సాధించిందని ముఖ్యమంత్రి తెలిపారు. అల్లూరి జిల్లా మినహా అన్ని జడ్పీలు చైర్మెన్ గెలిచామని వివరించారు. 7 జిల్లాల్లో ఒక్క జడ్పీటీసీ కూడా వైసీపీ గెలవలేదన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో కూటమికి 67 శాతం ఓట్లు వచ్చాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *