సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హోర్ముజ్ జలసంధిలో తాము సూచించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో పయనిస్తుందని ఆరోపిస్తూ.. సైప్రస్ జెండాతో ప్రయాణిస్తున్న GFS Galaxy వాణిజ్య నౌకపై నేడు, ఆదివారం ఇరాన్ దాడికి పాల్పడింది. నౌకలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఆ సమయంలో నౌకలో మొత్తం 11 మంది భారతీయులు ఉండగా.. 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఓ భారతీయుడు మాత్రం ఆచూకీ లేదు.. గల్లంతైన వ్యక్తి కోసం ఒమన్ అధికారులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టినట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై వరుస దాడులు చేస్తున్న ‘ఇరాన్ చర్యలు చట్టవిరుద్ధమని’ పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికి, శాంతియుత పరిష్కారం చేసుకోవాలని పిలుపునిచ్చింది. ఈ ఘటన అనంతరం హోర్ముజ్‌ను ఇరాన్ మూసివేసింది. దానితో అమెరికా మరోసారి ఇరాన్ ఫై వైమానిక దాడులకు దిగడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రంగా మారాయి.. దీనికి ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేస్తుండటంతో ఉద్రికతలు కొనసాగుతున్నాయి.
