సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దక్షిణ అండమాన్ సముద్రంలో నేడు, బుధవారం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో ఈ నెల 14వ తేదీ నాటికి తీవ్ర అల్పపీడనంగా, 15వ తేదీకల్లా వాయుగుండంగా బలపడనున్నది. దీని ప్రభావం తో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలులో చలిగాలులు తీవ్రత తో పాటు వర్షాలు పడతాయి. ఆతర్వాత పశ్చిమ వాయవ్యంగా మరింత బలపడి తుఫాన్‌గా మారి 17వ తేదీ తర్వాత ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటనున్నదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 15 నుంచి బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలు అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున నైరుతి, మధ్య బంగాళాఖాతం వైపు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే వాయుగుండం ఎటు పయనిస్తుందో ఇంకా స్పష్టత రాలేదని, దీని ప్రభావం ఎక్కువ శాతం ఏపీపై ఉండకపోవచ్చని , భారీ వర్షాలు మాత్రం కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
