సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎప్పుడు ఏపీలో నిరుద్యోగులకు లక్షల మందికి ఉద్యోగాలు అంటూ.. వందలాది నూతన పరిశ్రమలకు వందల కోట్ల , వేల కోట్ల భారీ పెట్టుబాటులతో ఒప్పందాలు కుదిరియాని యువతను ఊరిస్తూ వస్తున్నా సీఐఐ సదస్సు మరోసారి విశాఖ లో తాజగా ప్రారంభమైంది. వివిధ దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ వక్తలు హాజరయ్యారు.. విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో 31వ సీఐఐ భాగస్వామ్య 2026 సదస్సు ప్రారంభమైంది. సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది.ఈ సదస్సుకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేంద్రమంత్రితో కలిసి సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్.. సదస్సు ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అతిథులకు థింసా, తప్పెటగుళ్లు, గరగ నృత్యంతో డప్పులతో కళాకారులు స్వాగతం పలికారు.ఈ సదస్సులో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, పీయూష్ గోయల్ లు కూడా కళాకారులతో కలసి ఫుల్ జోష్‌తో డోలు వాయించారు. వివిధ కళా బృందాల వద్దకు వెళ్లి కళాకారులతో వారు ఫొటోలు దిగారు. ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికులను అభినందించి వారితో కలసి ఫొటోలు దిగారు.
