సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉభయ గోదావరి జిల్లాలో ప్రతి రోజు వేలాది వాహన ప్రయాణాలకు అనుసంధానంగా ఉన్న రాజమహేం ద్రవరం – కొవ్వూరు రోడ్‌ కం రైలు(ఆర్‌సీఆర్‌బీ) బ్రిడ్జిని మరమ్మతుల నిమిత్తం తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు కలెక్టర్‌ మాధవీలత ప్రకటించారు.ఈ మేరకు ఈ నెల 27( వచ్చే బుధవారం) నుంచి అక్టోబరు 26వ తేదీ వరకు 30 రోజులపాటు బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతి ఉండదన్నారు. ఈ దఫా రూ.2.10 కోట్లతో సెంట్రల్‌ క్యారేజ్‌వే, వయాడక్ట్‌ భాగం, అప్రోచ్‌లతో సహా దెబ్బతిన్న సెకండరీ జాయింట్లకు మరమ్మతులు చేపట్టడం జరుగుతుందన్నారు. ట్రాఫిక్‌ని ఆర్‌సీఆర్‌బీపై పూర్తిగా నిలిపివేస్తున్నామన్నారు. ఆర్‌సీఆర్‌బీ మూసివేస్తే విజ్జేశ్వరం, ధవళేశ్వరం మీదుగా.. లేదా ఇటువైపు గామన్‌ బ్రిడ్జి గుండా ఆల్‌రౌండ్‌ తిరిగి రావాల్సి ఉంటుంది. దీంతో డబ్బు, సమయం కూడా వృథా తప్పదు. అయితే ఆర్టీసీ బస్సులు గామన్‌ బ్రిడ్జి మీదుగానే నడిచే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *