సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దేశంలోనే కోట్లాది వీక్షకులు కలిగిన అగ్రస్థాయి యూ ట్యూబర్ గా పేరొందిన మన తెలుగువాడు ‘హర్ష సాయి‘ అంటే దేశంలో తెలియనివారు ఎవరు ఉండరేమో? అంత పాపులర్ షో లు ప్రజలకు సేవామార్గంలో చేసుకుపోతున్న అతను అతి సామాన్యుడి ఆశలను కలలను నిజం చేసేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడడు. రియల్ హీరో ఇమేజీ పొందిన ఈ డైనమిక్ యువకుడు రీల్ హీరోగా మారేందుకు తన దర్శకత్వంలో తానే హీరోగా ‘మెగా’ అనే సినిమా సిద్ధం అవుతుంది. దీని టైటిల్ నేడు, ఆదివారం అధికారికంగా ప్రకటించారు. సినిమా వచ్చే ఏడాది రిలీజ్ చెయ్యనున్నారు.
