సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కారణాలు ఏవైనాక్షణిక ఆవేశంలో గోదావరి జిల్లాలో నదిలోకి దూకేస్తున్న ఆత్మహత్యల కేసులు ఎక్కవయ్యాయి. ప్రభుత్వం, స్వచ్చంద సంస్థల సాయంతో ప్రజలలో కౌన్సిలింగ్ పక్రియ పెద్ద ఎత్తున చేపట్టవలసిన అవసరం కనపడుతుంది. తాజగా రాజమహేంద్రవరం దగ్గర రోడ్ కం రైలు వంతెనపై నుంచి మరో యువకుడు గోదావరిలోకి దూకేశాడు. స్థానిక మంగళవారపుపేటకు చెందిన రాజేష్ ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అప్పటి నుంచి యువకుడు ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఇంతలో అనారోగ్య సమస్యలు పెరిగి ఆర్ధిక భారము పెరగటం తో గోదావరిలోకి దూకాడు అని ప్రాధమిక సమాచారం.. అతడి మృతదేహం దోబీఘాట్ దగ్గర దొరికింది. అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానిస్తున్నారు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజగా పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ వంతెన ఫై నుండి కూడా మరో యువకుడు గోదావరి లో దూకెయ్యడం గమనార్హం.
