సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల అప్పులు. కష్టాలు, వేధింపులు కారణాలు ఏవైనా గోదావరి నదిలోకి దూకేస్తున్న ఆత్మహత్యల కేసులు ఎక్కవయ్యాయి. ఈనేపథ్యంలో ఇటీవల 3 కుటుంబాలుతో పాటు తాజగా, మలికిపురం మండలం దిండికి చెందిన ‘దేవ వికాస్‌’ అనే మరో యువకుడు గల్లంతు అవ్వడంతో ..పాలకొల్లు ఎమ్మెల్యే,, నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చించినాడ వంతెన దగ్గరకు వెళ్లి పరిశీలించారు..చించినాడలో వశిష్ఠ గోదావరిపై ఉన్న వంతెనపై ఆత్మహత్యల నివారణకు బ్రిడ్జికి ఇరువైపులా ప్రతిష్ఠమైన ఫెన్సింగ్‌ శరవేగంగా ఏర్పాటు చెయ్యాలని ,. జాతీయ రహదారులు, జలవనరుల శాఖాధికారులను ఆదేశించారు.. బ్రిడ్జిపై రాత్రి సమయంలో ఇబ్బంది లేకుండా 8 అడుగుల ఎత్తులో లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. గోదావరి జిల్లాలను కలుపుతూ . ప్రయాణ, రవాణా సౌకర్యాలు అందిస్తున్న ఈ బ్రిడ్జిపై వరుస విషాదాలు జరగడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *