సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి గురువారం ఉదయం ఉండి నియోజకవర్గం లోని కలవపూడి–గణపవరం రహదారిపై ఆకివీడు మండలం, చెరుకుమిల్లి గ్రామం వద్ద రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన రహదారి నిర్మాణ పనులకు,శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామా శంకుస్థాపన చేసారు. అనంతరం ఇదే గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో దాతల సహకారంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు కూడా రఘురామకృష్ణ రాజు శంకుస్థాపన చేశారు.విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించడంతో పాటు, గ్రామ ప్రజలకు సౌకర్యవంత మైన, మెరుగైన రహదారి సదుపాయాలను అందించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని దాతల సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని రఘురామకృష్ణ రాజు అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *