సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు బుధవారం రాజధాని అమరావతిలో కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. .మునిసిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 94 శాతం స్ట్రెయిక్ రేట్ సాధించామని హర్షం ప్రకటించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లల్లో దక్కిన విజయం అపూర్వమైనదని.. మన బాధ్యతను పెంచిందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ ఫలితాలు కూటమి సంక్షేమం – అభివృద్ధి – సుపరిపాలనకు గుర్తింపు అని అభివర్ణించారు. స్థానిక ఎన్నికల్లో సీట్లు దక్కించుకోలేని వారికి నామినేటెడ్ పోస్టులతో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో ‘మనం అనుకున్న విధంగానే ఫలితాలు’ సాధించామని పేర్కొన్నారు. రానున్న జడ్పీటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా టీడీపీ క్యాడర్ ఇదే తీరున పనిచేసి అన్ని జిల్లా పరిషత్, ఎంపీపీ స్థానాలు దక్కించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.
