సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ రాజకీయాల్లో జనసేన విజయపతాక ఎగిరింది. ‘ వంగవీటి’ చరిత్ర పునః ప్రారంభమయింది. కూటమి పార్టీల మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన వంగవీటి రాధాకృష్ణ ఘన విజయం సాధించి విజయవాడ మేయర్‌గా ఎన్నికయ్యారు. తన ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థి ఫై ఏకంగా 1,30,872 ఓట్ల భారీ మెజారిటీతో విజయం తన ఖాతాలో వేసుకున్నారు.ఈ విజయంతో కూటమి శ్రేణుల్లో.. వంగవీటి అభిమానుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. విశేషమేమిటంటే.. రాధాకృష్ణ పుట్టినరోజు నాడే విజయవాడ మేయర్‌గా ఎన్నిక కావడం పెద్ద హైలైట్ గా నిలచింది. మరింత మేయర్‌గా ఎన్నికైనట్లు అధికారికంగా ధ్రువీకరణ పత్రం అందుకునేందుకు వంగవీటి రాధాకృష్ణ తన సతీమణితో కలిసి వచ్చారు. ఎన్నికల ఫలితాల్లో ప్రజలు తనపై చూపిన విశ్వాసం, అందించిన అపారమైన మద్దతు తన బాధ్యతను మరింత పెంచాయని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *