సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అక్వాన్ తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. నేటి మంగళవారం ఉదయం అక్వాన్ తుపానుపై టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల ఈ కొద్దీ రోజులలోనే ఏపీని వరుసగా మూడో తుపాను తాకుతోందని రాష్ట్రానికి ఎన్నో విపత్తులు వచ్చాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని… వాటి ప్రభావం ప్రజలపై పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు, గంటకు 3 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోందని అధికారులు తెలిపారు. ఈరోజు సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారే ప్రమాదముందని ఆర్టీజీఎస్ అధికారులు చెప్పారు.. అక్వాన్ తుపాను కారణంగా 19, 20వ తేదీల్లో కోస్తా ఆంధ్ర, గోదావరి జిల్లాల లో భారీ వర్షాలు నమోదు కానున్నాయని, తుపాను ఈనెల 19వ తేదీన విశాఖ మచిలీపట్టణం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు
