సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో ఎల్ నినో ప్రభావంతో వర్ష కాలంలో వర్షాలు ఎప్పుడు పడతాయో ? కురిసిన ఎంతసేపు కురుస్తాయో? తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. ఇటీవల కాస్త చెదురుమదురుగా భీమవరంలో పాటు జిల్లా వ్యాప్తంగా వరుణుడు కాస్త కరుణిస్తున్నాడు.. కానీ కుంభవృష్టి తరహా ఒక్క వర్షం కూడా పడలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఉత్తర బంగాళాఖాతం లో రేపు గురువారం అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో వానలు కురవనున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర. గోదావరి జిల్లాలలో వచ్చే మూడు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.మొత్తానికి వినాయకచవితి పండగకు ముందు ఏపీని వరుణుడు కనికరించనున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *