సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీనియర్ సినీ హీరో విక్టరీ వెంకటేష్ తన 75వ సినిమాగా ‘సైంధవ్’ సినిమాతో సంక్రాంతి పండగ సందర్భంగా పాన్ ఇండియా సినిమాగా ప్రముఖ బాషలలో ప్రేక్షకుల ముందుకు నేడు, శనివారం వచ్చారు. శైలేష్ కొలను దీనికి దర్శకుడు, వెంకట్ బోయినపల్లి నిర్మాత. ఇందులో చాలామంది ఇతర భాషా నటులు వున్నారు. హిందీలో ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తెలుగులో ఈ సినిమాతో అరంగేట్రం చేశారు. సంతోష్ నారాయణ్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ కథ అంతా చంద్రప్రస్థ అనే ఒక సిటీలో జరుగుతుంది. సైంధవ్ కోనేరు లేదా సైకో (వెంకటేష్) చంద్రప్రస్థ పోర్టులో ఉద్యోగి. అతను తన పాప గాయత్రి (సారా పాలేకర్) తో ఉంటాడు, స్నేహితురాలు మనోజ్ఞ (శ్రద్దా శ్రీనాథ్) పక్కింట్లో ఉంటుంది, ఆమె ఒక క్యాబ్ డ్రైవర్. మనోజ్ఞ, తన భర్త (గెటప్ శ్రీను) మీద గృహ హింస కేసు పెట్టి వెంకటేష్ ఇంటి పక్కన ఉంటుంది, ఆమెకి సైంధవ్ అంటే ఎంతో ఇష్టం. అందుకే అతని బిడ్డను తన కూతురిలా చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు స్కూల్లో గాయత్రి ఉన్నట్టుండి కింద పడిపోతుంది, ఆసుపత్రికి తీసుకెళితే ఆమెకి ఎస్ఎంఏ (నాడీ కండరాల వ్యాధి) ఉందని, పాప బతకడానికి రూ.17 కోట్లు ఖరీదు చేసే ఇంజెక్షన్ అవసరం అని డాక్టర్లు చెబుతారు. మిత్రా (ముఖేష్ రుషి), వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ), మైఖేల్ (జిష్షు సేన్ గుప్తా) లు ఒక కార్టల్ టీము అక్రమంగా కొన్ని రవాణా వ్యాపారాలు చేస్తూ, అందులో కొంతమంది పిల్లల్ని కూడా అక్రమంగా తరలిస్తుంటారు. ఈ మాఫియా గ్యాంగ్ కి సైకో ( వెంకటేష్ )అంటే భయం. ఎందుకు వీళ్ళకి సైకో అంటే భయం? అతని నేపధ్యం ఏంటి? చివరికి పాపని బతికించుకున్నాడా? ఇవన్నీ సినిమా లో చూడవలసిందే.. ఇక దర్శకుడు శైలేష్ కొలను కి ఇంగ్లీష్ సినిమా ‘జాన్ విక్’ సినిమాని స్ఫూర్తిగా అతని టేకింగ్ కనపడుతోంది. సినిమా మొదటి నుండి చివరి వరకు యాక్షన్, హాలీవుడ్ సినిమా చుసిన ఫీలింగ్.. తెలుగుదనం మిస్ అయ్యింది. వెంకీ మామ ఎప్పటిలానే తన పాత్రలో జీవించేసాడు.. చివర 15 నిముషాలు సెంటిమెంట్ ఇరగదీసాడు.. నవాజ్ సిద్ధిక్ బాగా నటించిన కూడా తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడంతో తెలుగు బాషా సరిగ్గా పలకలేక అవస్థలు పడ్డాడు. తమిళహీరో ఆర్య పాత్ర పరిధి చాల చిన్నది.. శ్రద్ధ శ్రీనాథ్ బాగుంది, పరవాలేదు. ఆండ్రియా విలన్ గా చేసింది, సంగీతం ఓకే.. హింస ఎక్కువగా ఉంది.. మొత్తానికి సినిమా కాస్త డిఫెరెంట్ గా తీశారు. కానీ వినోదాత్మక సినిమాలు చూసే సంక్రాంతి సీజన్ లో వేసే కన్నా ప్రత్యేకంగా సింగిల్ గా రిలీజ్ చేసిఉంటే మరింత ఫలితం సాధించేది..
