సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల విజయవాడ కేంద్రంగా నమోదైన ఆన్‌లైన్ రాడికలైజేషన్ కేసు సంచలనం రేపింది.ఈ వ్యవహారంపై 2026 మార్చి 23న విజయవాడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పుడు 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొన్నారు. కేసుకు వివిధ రాష్ట్రాలతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి కేసు NIAకి బదిలీ అయింది. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఈ కేసులో తొమ్మిది మంది నిందితులపై నేడు శనివారం విజయవాడలోని ప్రత్యేక NIA కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ISISతో సంబంధాలు కొనసాగిస్తూ, సోషల్ మీడియా వేదికగా యువతను ప్రభావితం చేసి, ఉగ్రవాద కార్యకలాపాల వైపు ఆకర్షించేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు ఒకరితో ఒకరు రహస్యంగా సంప్రదింపులు జరుపుకునేందుకు ప్రత్యేకమైన సురక్షిత కమ్యూనికేషన్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసి, పరీక్షించినట్లు NIA ప్రకటించింది..దీనితో NIA ఛార్జిషీట్‌లో మహ్మద్ రెహ్మతుల్లా షరీఫ్, మహ్మద్ డానిష్, మీర్జా సొహైల్ బేగ్, లక్కీ అహ్మద్, జిషాన్ అబ్దుల్ మజీద్, మీర్ ఆసిఫ్ అలీ, అబ్దుల్ సలాం, షారుఖ్ ఖాన్, షేక్ ఫైజ్ ఉర్ రెహ్మాన్ పేర్లను చేర్చింది. వీరిపై BNS, UAPAలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్లు NIA తెలిపింది.
