సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వర్షాకాలం ముగింపు దశకు వచ్చినప్పటికీ ఏపీలో వర్షాలు అరకొరగా మాత్రమే పడుతున్నాయి. ఒక ప్రక్క నేటి శనివారం నుండి దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలలో వర్షాలు పెద్ద ఎత్తున పడుతున్నాయి. అయితే ఏపీలో మాత్రం గత 4 రోజులుగా ప్రచండంగా మారి ఎండాకాలం మరిపిస్తున్నాయి. పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా సైతం ఇదే పరిస్థితి. నేడు సెప్టెంబర్ 19నుండి అల్పపీడనం వాయుగుండంగా మరి తుపాను గా చెలరేగుతుంది అని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో వర్షాలు మాట దేవుడు ఎరుగు .. ఎండలు మాత్రం నిప్పులు తుపాను మరిపిస్తున్నాయి. ఇంట్లో ఉన్న తీవ్ర ఉక్కపోత.. ఏసీ లు ఉంటేనే ప్రజలు ఎలాగోలా బ్రతకగలరు. పిల్లలు, పెద్దలు సామాన్యులు , పేద ప్రజానీకం బ్రతుకులు దుర్భరంగా మారుతున్నాయి. అయితే ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఈ తుఫాను ప్రభావం కనిపిస్తుంది. ఏపీని మాత్రం వరుణుడు కనికరించడా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *