సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం సాయంత్రం ఎంపీ రఘురామా కృష్ణంరాజు భీమవరం శివారులోని తన నివాసానికి చేరుకొన్నారు. నేటి ఉదయం విజయవాడ నుంచి ఆయన మద్దతు దారులతో , టీడీపీ అభిమానుల ర్యాలీతో తాడేపల్లిగూడెం మధ్యాహ్నం వంటి గంట దాటాక చేరుకొన్నారు. అక్కడ తాడేపల్లిగూడెంలో ఘన స్వాగతం పలికిన కూటమి , జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి వలవల బాబ్జి , నాయకులు, అభిమానులు. స్వగతం పలికి పసుపు శాలువా కప్పి సన్మానించారు. తదుపరి . గరగపర్రు లో స్థానికుల కోరిక మేరకు శ్రీ షిర్డీ సాయి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసారు. యండగండి గొల్లలకోడేరు మీదుగా భీమవరం చేరుకొన్నారు. ఆయన నివాసం లో కూటమిలోని ఆయన సన్నిహితులతో తాజా పరిణామాలపై సమీక్ష జరుపుతున్నారు. రేపు ఎల్లుండి నరసాపురం, పాలకొల్లుల్లో చంద్రబాబు పాల్గొనే ప్రజాగళం సభల్లో ఆయన పాల్గొంటారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ లో చేరే అవకాశం ఉంది. ఉండి నుండి ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఏ స్థానం నుండి పోటీచేస్తారో? ఎంపీగాన , ఎమ్మెల్యేగాన ? ఇంకా సస్పెన్సు కొనసాగుతుంది.
