సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వరుస పరాజయాలతో ఉన్న యువహీరో విజయ్ దేవరకొండ కు కాస్త రిలీఫ్ ఇచ్చిన సినిమా ఖుషి .. మ్యూజికల్ గా ఈ సినిమా పాటలు హిట్ అయిన , టాలెంట్ దర్శకుడు శివ, సరికొత్త మన కాశ్మిర్ అందాలతో నిర్మించిన ఈ సినిమాలో హీరోయిన్ సమంత పెద్ద మైనస్ గా మారిపోయింది. ఆమె లో యవ్వనం పోయి మొహం శరీరం ముదురుగా కనపడటం తో విజయదేవరా తో కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. దీనితో సినిమా యూత్ కు పట్టలేదు. మొదటి 3 రోజులు కలెక్షన్స్ బాగున్నా 4వ రోజు నుండి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. అయితే ఖుషి సినిమా ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లెక్స్ లో అక్టోబర్ 1 నుంచి తెలుగుతో పాటు తమిళం , కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
