సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) . నేడు, గురువారం ఉదయం విశాఖలో ఏర్పాటు చేసిన ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. విశాఖ అంతర్జాతీయ స్థాయి నగరం అని.. అందమైన సముద్రము , పకృతి అందాలు తో పాటు అన్ని ఆధునిక వసతులు ఇక్కడ ఉన్నాయని అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను విశాఖలోనే ఏర్పాటు చేస్తోందని తెలియజేశారు. సింగపూర్ నుండి సముద్రం క్రింద నుండి సబ్ సీ కేబుల్ కూడా ఈ ప్రాంతం నుంచే ఏర్పాటు అవుతోందన్నారు. గతంలో తన హయాంలో ఐటీని అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో ప్రోత్సహించామని దాని ఫలితమే .. గూగుల్, ఆడోబ్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సంస్థల సీఈఓలు భారతీయులే ఉన్నారన్నారు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రకాల పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నామని . ఇందులో భాగంగా భారత్ క్వాంటం మిషన్ ప్రారంభించిందని… దానిని అందిపుచ్చుకుని తొలి క్వాంటం వ్యాలీని ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఏపీలో డ్రోన్ సిటీ ఏర్పాటు చేసి ఉత్పత్తి చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఏపీలో పెద్దఎత్తున పోర్టులను నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానాన్ని అమలు చేసి యుద్ధ ప్రాతిపదికన కేవలం 45 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. ఏపీలో పారిశ్రామిక ఉత్పత్తులు, విద్య, వైద్యం, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *