సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్ : నేడు, ఆదివారం పులివెందుల మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నా చాల పోలింగ్ కౌంటర్ లలో వైసీపీ ఏజెంట్స్ కూర్చోకుండా తరిమివెయ్యడం తో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.. ఆయనే స్వయంగా. సుమారు 70 మంది వైసీపీ పోలింగ్ ఏజెంట్స్ తో కలపి పులివెందుల రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం ఎదుట బైఠాయించి. ఆందోళన చేపట్టారు జగన్ మీడియా తో మాట్లాడుతూ.. ఈరోజు పులివెందుల పోలింగ్ జరిగిన భారీ అక్రమాలు, దాడులు రిగ్గింగ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని , ఇక్కడ ఎన్నికలను మరోసారి నిర్వహించాలని డిమాండ్ చేసారు... టీడీపీ ఏజెంట్స్ పోలింగ్ బూత్ లలో కూర్చుని ఓట్లు రిగ్గింగ్ చేస్తుంటే.. అధికారులు, పోలీసులు వారికీ సహకరిస్తున్నారని, రాష్ట్రములో పలుచోట్ల ఇదే పద్దతి లో ఎన్నికలు నిర్వహిస్తున్నారని , అధికారులు కూడా సిగ్గు పడుతున్నారనని విమర్శించారు. ప్రజలకు పధకాల పేరుతొ చేసిన ద్రోహాలకు మొహం చూపించలేక చంద్రబాబు ఇలా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నారని , సుప్రీం కోర్ట్ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా, పలు చోట్ల సీసీ ఫుటేజ్ లేకుండా, గుండాలను వదిలి ఓటర్లు ను భయ బ్రాంతుల్లకు గురి చేస్తున్నారని , బీహార్ ను మించిపోయారని , ఇండియా టుడే , ఎన్ టివి ఛానెల్స్ ప్రతినిదుల ఫై కూడా దాడులు చేసారని విమర్శించారు. ఇలా ఎన్నికలు నిర్వహించడానికి చంద్రబాబు కు సిగ్గు ఉందా ? అని జగన్ ఆగ్రహంగా ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *