సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి గురువారం ఉదయం వెనెజువెలాలో ఒక నిమిషం వ్యవధిలో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. మొదట 7.2 తీవ్రతతో, ఆ తర్వాత 7.5 తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి. ఈ ప్రకంపనలతో రాజధాని కారకస్తో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోగా, భారీ ఆస్తి నష్టం సంభవించిందిఈ వరుస భూకంపాల కారణంగా 10 వేల మంది మృతి చెందినట్లుగా భావిస్తుండగా.. వాస్తవంగా సుమారు లక్ష మంది వరకు మరణించి ఉండొచ్చని యూఎస్జీఎస్ హెచ్చరించింది. వెనెజువెలా ప్రభుత్వం మరణాల సంఖ్యను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు భూకంప ప్రభావం వెనెజువెలాతో పాటు బ్రెజిల్, కొలంబియా ప్రాంతాల్లో కూడా కనిపించింది (Venezuela death toll). ప్రారంభంలో కరేబియన్ ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, అనంతరం వాటిని ఉపసంహరించారు. ఇదిలా ఉండగా ఉత్తర జపాన్లో 6.9 తీవ్రతతో నేడు గురువారం భారీ భూకంపాలు సంభవించాయి. ఈ క్రమంలో టోక్యోతో సహా దేశంలోని చాలా ప్రాంతాలు భూకంపాలతో వణికిపోయాయి. అయితే ప్రాణ నష్టం వివరాలు ఇంకా వెలువడలేదు.
