సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నేడు, గురువారం ఉదయం నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం NBK 112 ప్రారంభోత్సవ షూటింగ్ వెంకటపాలెంలోని బిట్స్ పిలానీ గ్రౌండ్‌లో ప్రారంభోత్సవ వేడుక జరిగింది. ముహూర్తపు వేడుకకు మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బ్లాక్‌బస్టర్ విజయాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు కొరటాల శివ, మాస్ ఇమేజ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బాలకృష్ణ కాంబినేషన్‌లో తొలిసారి వస్తున్న NBK 112పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో బాలకృష్ణ మాట్లాడుతూ.. 20 ఏళ్ళ తరువాత ఆంధ్ర లో ప్రారంభమైన తోలి భారీ సినిమా ఇదేనని అన్నారు. ఏపీలో సినిమా షూటింగ్స్ పెరగవల్సిన అవసరం ఉందన్నారు. దీనికి ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *