సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో 2021 టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ హయాంలో విచారణ ఎదురుకొంటు..వారి అరెస్టులు ఖాయం అని ఒక వర్గం మీడియా లో ప్రచారం అవుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలకు సుప్రీంకోర్ట్ లో నేడు, శుక్రవారం బెయిల్ లభించింది. దేవినేని అవినాష్, జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి,తలశిల రఘురాం, గవాస్కర్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యా ప్తునకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశిం చింది. తదుపరి విచారణను నవంబర్ 4కి ధర్మా సనం వాయిదా వేసింది. వైఎస్సా ర్సీపీ తరఫున న్యాయవాదులు కపిల్ సిబల్, నీరజ్కిషన్ కౌశల్, అల్లంకి రమేష్ తమ వాదనలు వినిపించారు. న్యాయవాదులు తమ వాదనలలో వైఎస్సార్సీపీ నేతలపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోం ది. అక్రమ కేసులు బనాయించి కుట్రలకు తెరలేపింది. కక్ష సాధింపు చర్యల నుంచి వారికీ రక్షణ కల్పించాలి’’అని న్యాయవాదులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *