సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇది తెలుగు రాష్ట్రాలలో అయ్యప్పల భక్తి సీజన్.. ఏటా లక్షలాది మంది భక్తులు అయ్యప్ప దర్శనం కోసం కేరళకు వెళ్తుంటారు. చాలామంది రైలు ప్రయాణానికే సిద్ధం అవుతారు. .ఇకపై కెరలోని శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ కీలక సూచనలు చేసింది. రైళ్లలో కర్పూరం, అగరబత్తులు, దీపాలు వెలిగించడంపై ఆంక్షలు విధించింది. ఇరుముడి, పూజా సామగ్రి తీసుకెళ్లేవారు తెలుసుకోవాల్సిన విషయాలివే…అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పూజలు చేయడం అలవాటు. ఈ సమయంలో కర్పూరం, అగరబత్తులు, కొవ్వొత్తులు, నూనె దీపాలు వెలిగించడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే, వాటికీ దూరంగా ఉండాలి..రైలు ప్రయాణంలో ఇతర ప్రయాణికుల భద్రతకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. నేర తీవ్రతను బట్టి జరిమానా లేదా ఇతర శిక్షలు విధించే అవకాశం ఉందని రైల్వే శాఖ ఆదేశించింది.
