సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: దారుణమైన ఎండల దాటికి ఉక్కపోతలకు తట్టుకోలేకపోతున్నా ఆంధ్ర ప్రదేశ్ ప్రజానీకానికి శుభవార్త! నేటి ఆదివారం సాయంత్రం నైరుతి రుతుపవనాలు ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరి కోట లో ప్రవేశించాయి. కాగా, వచ్చే 24 గంటల్లో రాయలసీమ లోని మరికొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని మరో 3 రోజుల లోపు రాష్ట్రమంతా విస్తరించి వాన జల్లులు కురుస్తాయని వాతావరణశాఖ నేడు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొం ది.
