సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలువెత్తు బంగారు తల్లిగా తెలుగు రాష్ట్రాలలో భాసిల్లుతున్న భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి వందలాది భక్తులు ఇటీవల 40 రోజులు మాల ధారణ మరియు 21 రోజుల మాల మాల ధారణ చేసిన విషయం విదితమే.. అయితే నేటి బుధవారం ఉదయం నుండి ‘పాద మండలి’ దీక్షధారణ కార్యక్రమంలో కూడా వందలాది శ్రీ అమ్మవారి భక్తులు కొత్తగా దీక్ష స్వీకరించారు. ఆలయ ఆవరణంలో చక్కటి పందిళ్ళలో, ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ కళావేదిక వద్ద పూజ కార్యక్రమం నిర్వహించి భక్తులకు మాలల దీక్షను సమర్పించారు ఈసారి 11 రోజులకుగాను 200 మంది పైగా భక్తులు శ్రీ అమ్మవారి మాలలు ధరించారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి హరిసూర్య ప్రకాష్ తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *