సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మన భీమవరం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ లోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నేడు, శనివారం నిలువెత్తు శ్రీవారి మూలవిరాట్ విగ్రహంతో పాటు శ్రీ దేవేరులతో కూడిన శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు విశేష పుష్ప అలంకరణ జరిగింది. ఈ అలంకరణలో స్వామివారిని శ్రీ పద్మావతి అమ్మవార్లను దర్శించుకోవడానికి విశేషంగా భక్తులు వచ్చారు. శ్రీ పద్మావతి వేంకటేశ్వరుని దర్శన భాగ్యం సర్వ పాప హరణం సర్వవ్యాధి నివారణం శ్రీకరం శుభకరం
