సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో నేడు, శుక్రవారం నేపథ్యంలో విశేషంగా వేలాదిగా మహిళా భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించుకొని తదుపరి భారీ పదింట్లో నెలకొల్పిన శ్రీ వినాయక స్వామిని కూడా దర్శించుకొంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ అమ్మవారిని దర్శించుకున్న నరసరావు పేటకు చెందిన K జగన్మోహన్ రెడ్డి 8 గ్రాముల బంగారం మరియు D విశ్వేశ్వరావు 2 గ్రాముల బంగారం అమ్మవారికి విరాళంగా అందచేసినారు వీరికి ఆలయ ఉప ప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు పూజలు నిర్వహించారు..ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదాలు అందజేశారు.
