సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి సాధించిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి ఇటీవల అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి అటెండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి దాదాపు బాలీవుడ్ లోని అందరూ స్టార్స్ హాజరుకాగా.. సౌత్ నుంచి రజినీకాంత్, రామ్ చరణ్, మాత్రమే హాజరు అయ్యారు. ఆ సమయంలో జరిగిన ఈవెంట్ లో షారుక్ ఖాన్ రాంచరణ్ ను వేదికపైకి ఆహ్వానించి ఖాన్ త్రయం తో కలసి నాటు నాటు పాటకు స్టెప్స్ వేస్తుండగా .. ఇడ్లి వడ .. అంటూ రామ్ చరణ్ ను సంబోదించడం తో అవమానంగా భావించి స్టేజ్ మీద నుండి రాంచరణ్ వేగంగా దిగిపోయిన వీడియో వైరల్ కావడంతో దానికి దక్షిణాది వారు మరి హిందీ హీరోలను పావ్ బాజీలు’ అని పిలిస్తే ఉరుకొంటారా ? అంతటి అహం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ విషయంలో షారుఖ్ సారీ చెప్పాలంటూ డిమాండ్ చేసారు. . అయితే అసలు విషయం ఏంటంటే.. షారుఖ్ రామ్‌చరణ్‌ని అవమానించలేదు. తన తాజా మూవీలోని .. ఇడ్లి వడ .. అంటూ డైలాగ్‌ని చెప్పాడు. అని తాజగా విడుదల చేసిన ఒక వీడియోతో క్లారిటీ ఇచ్చారు. షారుఖ్ అభిమానులు. షారుఖ్ ఖాన్ నటించిన ‘వన్ 2 కా 4’ మూవీలో షారుఖ్ ఒక డైలాగ్ చెబుతారు. ఆ డైలాగ్ లో సౌత్ లో ఫేమస్ అయిన వాటి గురించి మాట్లాడుతూ.. ఇడ్లీ, వడ, రజినీకాంత్, వెంకటేష్, నాగార్జున అంటూ సంబోధిస్తారు. ఆ డైలాగ్ నే అంబానీ ఈవెంట్ లో చరణ్ పిలిచేటప్పుడు షారుఖ్ ఉపయోగించారు. రజిని పేరు స్థానంలో రామ్ చరణ్ పేరుని పెట్టి షారుఖ్ ఆ డైలాగ్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *