సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం పవిత్ర గురు పౌర్ణమి నేపథ్యంలో భీమవరం పట్టణంలో 14వ వార్డులోని మినీ షిరిడి, పంచా రామ క్షేత్రం, శ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయాలతో పాటు అన్ని సాయి బాబా దేవాలయాలలో ప్రత్యక పూజలు అభిషేకాలు, అన్నసమారాధనలు నిర్వహిస్తున్నారు. భీమవరం శివారులోని పెదమిరం లో స్వర్ణ సాయి మందిర్ లో సాక్షాత్తు షిర్డీ ని తలపించేలా భారీ స్థాయిలో గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి. నేటి ఉదయం 7గంటల నుండి సుమారు 12వేల మందిపైగా సాయి భక్తులు హాజరు అయ్యి క్యూ లైన్లలో నిలబడి బాబా వారికీ స్వయంగా పంచ ద్రవ్యాలతో, ఆవుపాలచే భక్తులచే సాయి విగ్రహానికి అభిషేకాలు నిర్వహించారు. ప్రతి ఏడాది లానే దాతల సహకారంతో ఉచితంగా ఈ అభిషేకం ఏర్పాటు చేసారు. భారీ పందిళ్ళలో ప్రత్యేక ఆకర్షణగా కేరళ డప్పుల వాయిద్యాలు, ఉత్తరాది తరహాలో సాయి కీర్తలనతో మహిళల కోలాటాలు హారతి సేవలు,పల్లకి సేవలు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు తో పాటు ఉదయం 8గంటల నుండి పంచ బక్ష పరమణలతో దాతల సహకారంతో వేలాది భక్తులకు అన్నసమారాధన నిర్వహిస్తున్నారు. నేటి రాత్రి 9-30 వరకు వేడుకలు, ప్రసాద వితరణలు కొనసాగుతాయి. ఇక్కడికి 7 కిమీ దూరంలో ఉన్న సీసలి గ్రామంలోని శ్రీ షిరిడి సాయి దేవాలయంలో కూడా వేలాది భక్తుల కోలాహలం నడుమ గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే జేపీ రోడ్డు లోని గురుదత్త అష్టలక్ష్మి ఆలయంలో కూడా విశేష కార్యక్రమాలు, యాగాలు నిర్వహిస్తున్నారు
