సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగువారికి అతి ప్రధాన పండుగ మకర సంక్రాంతి.. ఏడాదిలో వచ్చే తొలి పండగే కాదు. అతి పెద్ద పండగల్లో ఇది కూడా ఒకటి. ఈసారి ఈ మకర సంక్రాంతి పండగ జనవరి 14 లేదా 15వ తేదీన జరుపుకోవాలా? అనే సందేహం చాలా మందిలో ఉంది. . అదీకాక పండుగ ప్రత్యక్ష దైవం సూర్యునికి సంబందించినది కాబ్బటి సౌరమానం ఆధారంగా సంక్రాంతిని జరుపుకుంటాం. ఇంకా చెప్పాలంటే.. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర ఘడియలనే మకర సంక్రాంతిగా అంతా పరిగణిస్తారు. దీని ప్రకారం 2026లో మకర సంక్రాంతి వేడుకలకు జనవరి 14వ తేదీగా నిర్ణయించారు. ఈ రోజు మధ్యాహ్నం 3.13 గంటలకు సంక్రాంతి ముహూర్తం వస్తుంది. ఈ నేపథ్యంలో ఆ రోజే పండగ జరుపుకోవాలి. అంటే జనవరి 15వ తేదీ కాదన్నది సుస్పష్టం. నాలుగు రోజుల అతి పెద్ద పండుగ తెలుగు ప్రజలు చక్కగా జరుపుకోవాలని మీ.. సిగ్మా న్యూస్ శుభాకాంక్షలు తెలుపుతుంది.
