సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మునిసిపల్ కమిషనర్, ఎస్ శివరామ కృష్ణ నివాసం పైన, కార్యాలయం పైన మరియు విజయవాడలోని అతని నివాసం పైన పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు , వీరవాసరం సమీప గ్రామాలలో అతని సన్నిహితులు బంధువులు ఇండ్లపై ఏక కాలంలో నేటి బుధవారం ఉదయం 6 గంటల నుండి అవినీతి నిరోధక శాఖ అధికారులు ( ఏసీబీ) దాడులు నిర్వహిస్తున్నారు. భీమవరంలో కమిషనర్ తో పాటు పట్టణంలోని కీలకమైన మున్సిపల్ అధికారుల ఇళ్లపై కూడా దాడులు జరుగుతున్నట్లు సమాచారం.. మొత్తం 27 మంది ఏసీబీ అధికారులు పట్టణంలో విచారణ లు చేస్తున్నట్లు , దీనికి సంబంధించి పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాలలో మొత్తం 9 ప్రాంతాలలో ఆయనకు సంబంధించి ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నట్లు వార్త సమాచారం. అయితే మునిసిపల్ కమిషనర్ ఆస్తులపై వచ్చిన పిర్యాదు లు మేరకు వాటి లో నిజనిర్ధారణకు నేటి రాత్రి వరకు ఏసీబీ విచారణలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. భీమవరం లో సుమారు 2 ఏళ్లుగా కమిషనర్ గా సేవలు అందిస్తున్న శివరామ కృష్ణ గతంలో మచిలీపట్టణం కమిషనర్ గా సుదీర్ఘ కాలం పనిచేసారు. ఏది ఏమైనా ఈ ఏసీబీ దాడుల వార్త తెలుగు రాష్ట్రాల మీడియా ఛానెల్స్ లో భారీగా వైరల్ అవుతుంది.
