సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సినీ నటనకు పెట్టని కోట.. కోట శ్రీనివాసరావు(83) (Kota Srinivasa Rao) నేటి ఆదివారం (జులై13)న ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. కోట మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. ఆయన నివాసం వద్ద సినీ ప్రముఖులు ఆయన పార్ధీవ దేహాన్ని కడసారి చూపు దర్శించు కొంటున్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కూడా స్వయంగా హాజరు అయ్యారు. తెలుగు రాష్ట్రాల సీఎం లు రేవంత్ రెడ్డి, చంద్రబాబు , మాజీ సీఎం జగన్ సంతాప సందేశాలు తెలిపారు. నేటి మధ్యాహ్నం 2గంటలకు మహాప్రస్థానంలో కోట అంత్యక్రియలు చేస్తున్నారు. 1942 జులై 10వ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడులో కోట జన్మించారు. 750కి పైగా సినిమాల్లో కోట శ్రీనివాసరావు నటించారు. ప్రతిఘటన సినిమాతో గుర్తింపు పొంది నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. కామిడి విలన్ గా ‘ఆహ నా పెళ్ళంట’ .. ఒక ల్యాండ్ మార్క్ తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలోనూ నటించారు. 2015లో కోట శ్రీనివాసరావు పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. కోట 9 నంది అవార్డులు, సైమా అవార్డు సాధించారు. వెంకటేష్ హీరోగా నటించిన శత్రువు, గణేష్ లలో మెయిన్ విలన్ గా హీరో తండ్రిగా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో కోట కు హైగ్రేడ్ ప్రమోషన్ సినిమాలు అని చెప్పవచ్చు.. రామ్ గోపాల్ వర్మ ‘గాయం’ తో పాటు ‘సర్కార్’ సినిమాలో అమితాబ్ కు మిత్ర ద్రోహిగా విలన్ గా హిందీ ప్రేక్షకులను అబ్బురపరిచింది. తమిళం లో విక్రమ్ హీరోగా స్వామి సినిమా విలన్ గా తమిళంలో చాల బిజీ అయ్యారు. మని, గబ్బర్ సింగ్ సినిమాలలో అల్ టైం హిట్స్ పాటలు పాడి గాయకుడుగా అలరించారు. విజయవాడ నుండి బీజేపీ ఎమ్మెల్యే గా కూడా ప్రజా సేవ చేసారు కోట శ్రీనివాస రావు..
