సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ సభాపక్ష నేత రేవంత్ రెడ్డి రేపు (గురువారం) మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా పార్టీ కేంద్ర అడ్జక్షుడు మల్లికార్జున ఖర్గేను, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా ప్రత్యేకంగా కలిసి ఆహ్వానం పలికారు. ఏపీ సీఎం జగన్ కు, తమిళనాడు సీఎం స్టాలిన్ కు, మాజీ సీఎం చంద్రబాబు కు ఆహ్వానాలు పంపారు.. బయట సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు మంత్రి వర్గం లిస్ట్ పై ఇంకా చర్చ జరగలేదని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ లీ తెలిపారు. ఇదిలావుండగా రేవంత్ ప్రమాణస్వీకారానికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు శర వేగంగా జరుగుతున్నాయి. భీమవరం నుండి కూడా ఆయన బంధువులు, పలువురు ప్రముఖులు ఆయన ప్రమాణ స్వీకారానికి తరలి వెళుతున్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం జరుగుతున్నా నేపథ్యంలో భీమవరంలో హోసింగ్ బోర్డు లో ఆయన వియ్యంకుని ఇంటివద్ద పెద్ద ఎత్తున సంబరాలు మిఠాయిలు పంపిణీలు జరుగుతున్నాయి. పట్టణంలో ఫెక్సీలు వెలిసాయి. ( రేవంత్ రెడ్డి కుమార్తె ను భీమవరం లోని ప్రముఖ వ్యాపార సంస్థ.. రెడ్డి & రెడ్డి వారి కుమారునికి ఇచ్చి వియ్యం అందటం తెలిసిందే..గతంలో పలుమారులు రేవంత్ రెడ్డ్ భీమవరంలో వచ్చి వేడుకలలో కూడా పాల్గొనడం, ఇక్కడివారితో పరిచయాలు పెంచుకోవడం జరిగింది. )
