సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లోని ప్రతిష్టాకరమైన పోలవరం ప్రాజెక్టు ను సందర్శించడానికి రేపు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వస్తున్నారని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాల రాజు ప్రకటించారు. చంద్రబాబు సీఎం అయ్యాక తొలిసారి జిల్లాలో పర్యటన నేపథ్యంలో సీఎం పోల వరం చేరుకుని ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారని వివరించారు. ప్రాజెక్టు పనులు నత్త నడక నడుస్తున్నాయని, తమ ఎన్డీయే కూటమి ప్రభుత్వం రావడం కేంద్రం లో ప్రధాని మోడీ , ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇకపై ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తీ చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమం లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే లు మంత్రులు, కీలక నేతలు, రేపు చంద్రబాబు కు స్వగతం పలకడానికి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అధికారులు నివేదికలతో పాటు సర్వం సిద్ధం చేసే పనిలో ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *