సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భముగా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ అభిమానులు నిన్నటి నుండి వేడుకలు మొదలెట్టేసారు. బిజినెస్ మెన్’ వంటి సూపర్ హిట్ సినిమాను 4కే క్వాలిటీ లో నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తే మరోసారి కోట్లు కొల్లగొడుతుంది. భీమవరంలో పద్మాలయా లో రిలీజ్ అయ్యింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంభోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ..గుంటూరుకారం లో శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా కనిపించబోతున్నా రు.. ఈ సినిమా నుంచి ఇక తాజాగా పోస్టర్ ను రిలీజ్ చేశారు.. ఆ పోస్టర్ లో మహేష్ లుక్ లో మాస్ లుక్ కనిపిస్తున్నా డు..కిరాయి కోటిగాడు సినిమాలో కృష్ణ తరహాలో లుంగీ ధరించి సిగరెట్ కలుస్తున్న మహేష్ మాస్ లుక్ ను మేకర్స్ బర్త్ డే స్పె షల్ గా రిలీజ్ చేశారు.. ఈ పోస్టర్ విడుదలైన క్షణాల్లోనే వైరల్ గా మారింది. అయితే గత కొన్ని రోజులు నుంచి ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది. మరి సాంగ్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ఆశలు ఆవిరిఅయ్యాయి.. ఈ సినిమాలో జగపతి బాబు, రేఖ, రమ్యకృష్ణ, జైరాం , బ్రహ్మానందం,సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.. ఇప్పుడు పోస్టర్ తో పాటు సంక్రాంతికి రిలీజ్ పక్కా అని క్లారిటీ ఇస్తూ జనవరి 12న గుంటూరుకారం రిలీజ్ అని అధికారికంగా ప్రకటించారు.
