సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా నష్టపోయాయి. గత ముగింపు 23,146.15 పాయింట్లతో పోలిస్తే, నేడు 257.20 పాయింట్లు (1.11 శాతం) క్షీణించి 22,888.95 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో ఒకానొక దశలో 22,845.00 వద్ద కనిష్ఠ స్థాయిని తాకింది. సెన్సెక్స్ గత ముగింపు 74,729.27 పాయింట్ల కంటే ఏకంగా 876.38 పాయింట్లు (1.17 శాతం) పడిపోయి 73,852.90 వద్ద ముగిసింది.. ట్రేడింగ్ సమయంలో అత్యల్పంగా 73,708.54 పాయింట్ల స్థాయికి చేరుకుంది.ఉదయం ప్రారంభంలోనే స్వల్ప లాభాలు కనిపించినా, ఆ వెంటనే నష్టాలలోకి జరిగిపోయింది.
