సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా ప్రకటించినట్లు శాంతి ఒప్పదం ఇంకా పూర్తిగా కుదరలేదని చర్చలు జరుగుతున్నాయని ఇరాన్ ధీమాగా ప్రకటించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ రాజుకున్న నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాలతో రోజును ముగించాయి. గత సెషన్ ముగింపు (76,488)తో పోల్చుకుంటే నేటి మంగళవారం ఉదయం దాదాపు 250 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కాస్త తేరుకున్నప్పటికీ చివర్లో అమ్మకాల వల్ల సూచీలు మళ్లీ నష్టాల బాట పట్టాయి. చివరకు సెన్సెక్స్ 479 పాయింట్ల నష్టంతో 76,009 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా చివరకు 118 పాయింట్ల నష్టంతో 23,913 వద్ద స్థిరపడింది (stock market).సెన్సెక్స్‌, నిఫ్టీలో ఎక్సైడ్ ఇండస్ట్రీస్, అదానీ పవర్, ఇన్ఫో ఎడ్జ్, అదానీ ఎనర్జీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 332 పాయింట్లు ఆర్జించింది.మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి 95.68కు బలహీనపడడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *