సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీమవరం గునుపూడి లో వేంచేసి యున్న శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు శివరాత్రి కళ్యామహోత్సవములు సందర్భముగా ఏర్పాట్లను నేడు, మంగళవారం జిల్లా ఎస్పీ అద్వాన్ సయిం అస్మిన్, మరియు జిల్లా అధనపు ఎస్పి(అడ్మిన్) .భీమారావు , డిఎస్పీ జయసూర్య పర్యవేక్షించారు.. ఈ కార్యక్రమం నందు ఆర్డీఓ ప్రవీణ్ కుమార్, ఆర్డీవో, ఎంఆర్ ఓ , రాంబాబు, భీమవరం 1 టౌన్ సి.ఐ యమ్.నాగరాజు, దేవదాయ ధర్మదాయ శాఖ, భీమవరం వి .వెంకటేశ్వర రావు పాల్గొయున్నారు. ముందుగా శ్రీ స్వామి వారినిఆలయ మర్యాదలతో ప్రదక్షణం చేసుకొని దర్శనం చేసుకొన్నారు. రేపు బుధవారం తెల్లవారు జాము 3 గంటల నుండి వేలాది భక్తుల కు ఎటువంటి అసౌకర్యం లేకుండా త్వరితంగా శ్రీ స్వామివారి దర్సనం జరిగేందుకు దేవాలయ కార్యనిర్వాహణ అధికారి డి రామకృష్ణంరాజు తో చర్చించి పోలీసులకు ఆదేశాలు జారీ చేసారు. రధోత్సవం, తెప్పోత్సవం రోజులలో అనుసరించవలసిన ప్యూహాత్మక ఏర్పాట్లను, దూరప్రాంతాల భక్తుల వాహనాల, బస్సు ల పార్కింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.( ఫై తాజా చిత్రాలను వీక్షించవచ్చు)
