సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దారుణమైన స్టాక్ మార్కెట్ పతనం ఇప్పటిలో వదిలేలా లేదు.. నేడు, సోమవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) భారీ నష్టాలతో మొదలయ్యాయి. మొదట ప్రారంభ ట్రేడింగ్‌లో అన్ని సూచీలు గ్రీన్‌లో ప్రారంభమయ్యాయి. కానీ ఆ తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ రెడ్‌లోకి మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఉదయం 9.53 నిమిషాల నాటికి సెన్సెక్స్ 421 పాయింట్ల నష్టంతో 77,159 స్థాయిలో ఉంది. , నిఫ్టీ 137 పాయింట్లు తగ్గి 23,396 పరిధిలో ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి 50,249 స్థాయిలో ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 152 పాయింట్లు నష్టపోయింది. దీంతో మదుపర్లు లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *