సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ,, టీడీపీ తమకు కేటాయించిన స్తనాలు తమకు ఆమోదయోగ్యం కాకపోతే ,, అవసరం అయితే పార్టీ బలపడటానికి స్వతంత్రంగా పోటీ చేస్తుందని, జనసేన పార్టీ క్యాడర్ కు భరోసా ఇస్తూ గెలిచే స్థానాలు ఎంపికకు విధివిధానాల రూపకల్పనపై 14 మంది సభ్యులతో ఓ కమిటీని జనసేన అధినేత పవన్ కళ్యణ్ ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలపై తొలి సమావేశం నేడు శుక్రవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరిగింది. ఆయా జిల్లాల వారీగా బలాబలాలు, పోటీ చేసే స్థానాలపై ఈ సమావేశంలో అగ్రనేతలు చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలపై ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసైనికులు, వీరమహిళలు ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఈ ఎన్నికల్లో కూటమి పార్టీల పొత్తుధర్మం పాటిస్తామని వ్యాఖ్యానించారు. అంటే తక్కువ సీట్లు కేటాయించిన కూటమి ధర్మం పాటించవల్సిందేనా? అని పార్టీ శ్రేణులు విస్తుపోతున్నాయి. స్థానికంగా ఉండే పరిస్థితుల ఆధారంగా పోటీ చేయడంపై దృష్టిపెడతామని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. ఈ స్థానిక ఎన్నికల్లో క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ లేని వారిని గెలిపించాలని నిర్ణయించాం అని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు.
